Krupa Kshemamu Song lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

Krupa Kshemamu Song lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు ||2||
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా ||2||

  1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
    లెక్కకు మించిన దీవెనలైనాయి ||2||
    అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
    కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను ||2||
    నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
    నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే||2||
    ఆరాధన నీకే ||కృపా||
  2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
    పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి ||2||
    కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
    గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను ||2||
    ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
    నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే ||2||
    ఆరాధన నీకే ||కృపా||
    3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
    నా హృది నీ కొరకు పదిలపరచితిని ||2||
    బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
    అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా ||2||
    ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
    ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే ||2||
    ఆరాధన నీకే ||కృపా||




Telugu Christian Songs



Leave a Reply