Na Neethi Suryuda Song Lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

Na Neethi Suryuda Song Lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే మహారాజవు
కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి (2) ||నా నీతి||

శ్రమలలో – బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే – కృపావాక్యమే – నను వీడని అనుబంధమై (2)
నీమాటలే – జలధారాలై – సంతృప్తి నిచ్చెను
నీమాటలే – ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే మహారాజవు
కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి (2) ||నా నీతి||

మేలులకై – సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు – కొదువ చేయవు – నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు – చేయుచున్నవాడా
సజీవుడవై – అధిక స్తోత్రము – పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే యేసయ్యా
నీవుంటే చాలునయా
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి ||నా నీతి||

సంఘమై – నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో – మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో – ఫలములతో – నీకై బ్రతకాలని
తుదిశ్వాస – నీ సన్నిధిలో – విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే యేసయ్యా
నీ కోసమే నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||


Telugu Christian Songs



Leave a Reply