The American Missionary John Allen Chau killed by the Sentinelese Tribe Island Andaman and Nicobar

The American Missionary John Allen Chau killed by the Sentinelese Tribe Island Andaman and Nicobar

 

John Allen Chau

 

దేవుని కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని గొప్ప సేవకుడు…!!
తనని చంపుతారని తెలిసికుడా దేవుని సువార్తను ప్రకటించాలనే తాపత్రయం తనని హతసాక్షిని చేసింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

మరీ నువ్వు నేను చేస్తుంది❓❓❓❓❓

*సెంటినెలిస్ తెగ వారికి సువార్త ప్రకటించుటకు వెళ్ళి హత సాక్షి అయిన మిషనెరీ “జాన్ అలెన్ చౌ”.*

అదొక చిన్న దీవి,అందులోకి బయటి ప్రపంచం వారు అడుగు పెడితే చాలు మనుషులని చూడకుండా చంపేస్తారు.
ఆ దీవి అండమాన్ నికోబార్ దీవులలో ఉంది.
దాని పేరు “నార్త్ సెంటిలిన్”. అక్కడి సెంటిలెనిస్ తెగ చాలా ప్రమాదకరమైన జాతిగా గుర్తింపు పొందారు.
జనాభ సంఖ్య కేవలం 50 మంది మాత్రమే.

అంటువంటి దీవికి “జాన్ అలెన్ చౌ”(John Allen Chau)(మిషెనెరీ)సువార్త కొరకు వెళ్ళి నవంబర్ 17న అక్కడ అడుగు పెట్టగానే అక్కడి సెంటినెలీస్ జాతి మనుష్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయి హతసాక్షి అయ్యాడు.

చనిపోయే ముందు జాన్ పలికిన మాటలు,
*”ప్రభువా ఈ దీవి సాతాను బలమైన కబంధ హస్తాలలో ఉంది,కనీసం ఇక్కడి ప్రజలకు నీ పేరు అయినా తెలియాలి”* అని జాన్ పలికిన మాటలు ఎంతో ఆవేధనకు గూరి చేసాయి.

*ఆ తెగ వారు చాలా కఠినులని,అక్కడికి వెళ్తే చంపేస్తారని తెలిసిన 16 నవంబరు ఉదయాన్నే సూర్యున్ని చూస్తు రెపటి దినమున బహుశా మరొక ఉదయం నేను చూడక పోవచ్చు అని జాన్ తనలో తాను అనుకున్నాడు.*

ఆ రోజంతా తీవ్ర భయంతోనే గడిపాడు ఎలా అయినా సరే యేసు నామం ఆ తెగ వారికి తెలియజేయాలని తన ప్రాణాలను పనంగా పెట్టి నార్త్ సెంటినెల్ దీవికి బయలు దేరాడు.

నిండా 50 మంది కూడా ఉండని ఆ సెంటినెలిస్ తెగ కోసం జాన్ తన ప్రణాలను సైతం లెక్క చేయకుండా ధైర్య సహసం చేసి ఆ దీవికి చేరుకున్న మరుక్షణమే జాన్ ఆ తెగవారి బాణాలకు నేలకొరిగి అక్కడికక్కడే తన ప్రాణం విడిచాడు.

*జాన్ అలెన్ చౌ నీ మరణం వ్యర్ధం కాదు,ఆ దీవి నేలపై మొర్రపెడుతున్న నీ రక్తం ఆ ప్రజలకు రక్షణను తెస్తుంది.*

నీ మరణం మాకెంతో గుణపాఠం నేర్పింది మరియు క్రీస్తు సువార్త సేవలో ఇంకా బాధ్యత కలిగి భారంతో సేవ చేయుటకు తోడ్పడింది.

పరలోకంలో నీవు పొందుకునే జీవ కిరీటమును మేము చూచి ఆనందిస్తాము.

Note:
నేటి దినాలలో ఎంతమంది సేవకులు పబ్లిసిటీ కోసం,సభలకు ఎక్కువ మంది ఉంటేనే వాక్యం చెప్తాను,
నేను రావాలంటే ఇంత డబ్బు కావాలి,
ఇన్ని వసతులు ఉండాలి,ఇవే తింటాను అని రకరకాలుగా డిమాండ్స్ చేస్తు దేవుని సేవను బిజినెస్ చేస్తున్నవారు ఎంతమంది లేరు?
ఇటువంటి వారికి ఆత్మల రక్షణ కొరకైన భారం ఉందంటారా?

నిజముగా నేటి ఈ అంత్య దినాలలో “జాన్ అలెన్” లాంటి హతసాక్షుల మరణాలు నేటి సేవకులకు గొప్ప కనువిప్పు వంటిది.

సేవకుడా నీ సేవ బాధ్యతతో కూడినిదా లేక బిజినెస్ తొ కూడినిదా పరీక్షించుకో?

ఆత్మల కోసం ప్రసవ వేధన లేని రోధన క్రీస్తు సంఘానికి మురికి వంటిది.

ఆత్మల సంపాదనే ద్యేయంగా నిరంతరం ప్రసవ వేదన పడుతూ కన్నీరు కారుస్తు చేసే సేవ క్రీస్తు సంఘమునకు పరిమళ వాసనగా పరలోక మహిమ ప్రతిబింబముగా మారుతుంది.

#హతసాక్షుల_మరణం_సంఘానికి_విత్తనం.

 

 

Leave a Reply