Vinare Yo Narulara Song Lyrics | Andhra Kristava Keertanalu Telugu Christian Golden Hits Songs Jesus

Vinare Yo Narulara Song Lyrics | Andhra Kristava Keertanalu Telugu Christian Golden Hits Songs Jesus

 

 

ఎంతో సాహిత్యం మరియు జీవిత అనుభవం నుండి రాసిన భక్తుల పాటలు, ఎల్లపుడు మనకు నూతను ఉజ్జివం నింపుతాయి.
వారిని గౌరవించుటకు మా ఈ ప్రయత్నం.

Vinare Yo Narulara Song Lyrics
Andhra Kristava Keertanalu
Vinare O Narulara Song Lyrics
Telugu Christian Old Songs
ఆంధ్ర క్రైస్తవ కీర్తన 104. వినరేయో నరులారా
Song information BDP Rao Garu
Purushotham Chowdary Christian Songs

వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥

1. నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ — దొరయౌ మరియా వరపత్రుఁడు – వినరే = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను గనరే ॥వినరే॥

2. ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బూని తనమేని సిలువ – మ్రాను నణఁ చి మృతిఁ బొందెను – వినరే = దీన దయా పరుఁ – డైన మహాత్ముఁడు – జానుగ – యాగము సలిపిన తెరంగిది ॥వినరే॥

3. పొందుఁ గోరిన వారి – విందా పరమోపకారి – యెంద రెందరిఁ బరమా – నందపద మొందఁగఁ జేసెను – వినరే = అందమునన్ దన – బొంది సురక్తము – జిందెను భక్తుల – డెందము గుందఁగ ॥వినరే॥

4. ఇల మాయావాదుల మాని – యితఁడే సద్గురు డని – తలపోసి చూచి మతి ని – శ్చల భక్తిని గొలిచిన వారికి – వినరే =నిల జనులకు గలు-ములనలరెడు ధని-కుల కందని సుఖ – ములు మరి యొసఁగును ॥వినరే॥

5. దురితము లణఁప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగఁ జనె – వినరే = బిరబిర మన మం – దర మా కరుణా – శరనిధి చరణ మె – శరణని పోదము ॥వినరే॥

పురుషోత్తమ చౌదరి గారు

Telugu Christian Songs
► Subscribe Channel – Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw
► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
#TeluguChristianGoldenHitsSongsJesus

 

RELATED CHRISTIAN LINKS

 

One Response

  1. Palasi.pandanna
    April 4, 2019

Leave a Reply